ETV Bharat / state

రెన్యూవల్​కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ - ఆర్జేడీ కార్యాలయం

పాఠశాల రెన్యూవల్​ కోసం డబ్బులు తీసుకున్నారని ప్రైవేట్ స్కూల్ యజమాని ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కృష్ణవేణి స్కూల్​ యజమాని మల్లేశ్​ హైదరాబాద్​లోని ఆర్జేడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​కు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

private school owner allegations on rjd office to taking money for  renewal krishnaveni school in kothakota wanaparthy distict
రెన్యూవల్​కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ
author img

By

Published : Mar 3, 2021, 5:32 PM IST

హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో పాఠశాల రెన్యూవల్​కు డబ్బులు తీసుకున్నారని కొత్తకోటకు చెందిన మల్లేశ్ ఆరోపించారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో ఉన్న కృష్ణవేణి పాఠశాలను రెన్యువల్ చేయడానికి రూ.30వేలు తీసుకున్నారని మల్లేశ్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్​లోని ఆర్జేడీ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్​ సతీశ్​తో సంభాషించిన దృశ్యాలను ఆయన రహస్యంగా తన చరవాణిలో చిత్రీకరించారు. రెండు నెలలుగా ఆర్జేడీ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకోకుండా పని చేయడం లేదని మల్లేశ్ ఆరోపిస్తున్నారు.

రెన్యూవల్​కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ

మా వద్ద పెండింగ్​లో లేదు:

పాఠశాల ప్రారంభించడానికి చెల్లించాల్సిన చలానా డబ్బుల గురించి మాత్రమే మల్లేశ్ వద్ద ప్రస్తావించానని.. అతని వద్ద డబ్బులు తీసుకోలేదని ఆర్జేడీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సతీశ్​ ఈటీవీ ప్రతినిధికి తెలిపారు. కృష్ణవేణి పాఠశాల రెన్యూవల్​ చేశామని.. దానికి సంబంధించి ఎలాంటి ఫైళ్లు తమ కార్యాలయంలో పెండింగ్​లో లేవని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆర్జేడీ రమేశ్ వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి రాలేదని.. మల్లేశ్ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తానని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.