మంగళవారం వనపర్తి జిల్లా ఏదుల గ్రామంలో ఎస్పీ రెడ్డి అనే ఎరువుల దుకాణం నుంచి 89 కిలోల కందులు, టమాటా ఇతర విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అపూర్వ రావు వెల్లడించారు. నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారుపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోయినట్లు గ్రహిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైతే నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: '5 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చివరలోనే'