ETV Bharat / state

పెట్రోల్‌ పంపులో మోసాలపై వినియోగదారుల నిరసన

author img

By

Published : Aug 18, 2019, 4:50 PM IST

పెట్రోల్‌ పంపులో మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ... వాహనదారులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

పెట్రోల్‌ పంపులో మోసాలపై వినియోగదారుల నిరసన

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపులో మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపించారు. ఇవాళ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.1020 డీజిల్‌ కొనుగోలు చేస్తే... రూ. 820 విలువైన ఇంధనం మాత్రమే కారులో పోసినట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మేనేజర్ దృష్టికి తీసుకుపోగా సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు వారు వివరించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై నరేందర్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి చర్యలు తీసకుంటామని ఇచ్చిన హామీతో నిరసన విరమించారు.

పెట్రోల్‌ పంపులో మోసాలపై వినియోగదారుల నిరసన

ఇదీ చూడండి: హైవేపై ట్రాఫిక్​ జామ్​కు కారణమైన విమానం

Intro:tg_mbnr_01_18_petrol_pump_fraud_customer_strike_avb_ts10053Body:tg_mbnr_01_18_petrol_pump_fraud_customer_strike_avb_ts10053Conclusion:tg_mbnr_01_18_petrol_pump_fraud_customer_strike_avb_ts10053
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఇటీవల ఏర్పాటుచేసిన పెట్రోల్ పంపులో మోసాలు జరుగుతున్నాయని పెట్రోల్ పంపు నిర్వాహకులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణానికి చెందిన పలువురు వాహనచోదకులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఆదివారం పట్టణానికి చెందిన సామేలు అనే వ్యక్తి తన కారులో 1020 రూపాయల డిజిల్ పోయామని పంపుకు వెళ్లగా కేవలం 820 రూపాయల డిజిల్ మాత్రమే వచ్చిందని రెండు వందల రూపాయలకు సంబంధించిన డీజిల్ రాకుండానే మీటర్ తిరగడం గమనించిన సామేలు కార్లో పెట్టిన పెట్రోల్ గన్ తీసి చూడగా డీజిల్ రాకుండానే ఉందని పేర్కొంటున్నారు
పంపు లో జరిగిన మోసాన్ని మేనేజర్ దృష్టికి తీసుకురాగా అతను సమర్ధించుకునే ప్రయత్నం చేయడంతో విసిగిపోయిన వాహనచోదకులు పెట్రోల్ పంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంపు ముందర ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించారు
తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు
విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ నరేందర్ సంఘటన స్థలాన్ని ని సందర్శించి పెట్రోల్ పంప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి నిర్వాహకులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వాహనచోదకులు వారి నిరసన విరమించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.