ETV Bharat / state

farmer problems: తెగుళ్లతో వేరుశనగ రైతులకు మిగిలిన నిరాశ.. దిగుబడి లేక దిగాలు - palli farmer problems

farmer problems: ప్రత్యామ్నాయ పంటల వైపు మెుగ్గు చూపాలని ప్రభుత్వం చెబుతున్నా ఆశించిన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు. ఆరుతడి పంటలు పండించిన లాభం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వేరుశనగ పంటకు తెగుళ్లు సోకి దిగుబడి రాకపోవటం ఇందుకు అద్ధం పడుతుంది. కనీసం కూలీల ఖర్చులు కూడా సరిపోవటం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

farmer problems: తెగుళ్లతో వేరుశనగ రైతులకు మిగిలిన నిరాశ.. దిగుబడి లేక దిగాలు

author img

By

Published : Dec 26, 2021, 7:55 PM IST

farmer problems: తెగుళ్లతో వేరుశనగ రైతులకు మిగిలిన నిరాశ.. దిగుబడి లేక దిగాలు

farmer problems: వనపర్తి జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. పల్లి పంటకు అధిక ధర వస్తుందని భావించిన అన్నదాతలు.. వేల పెట్టుబడులు భరించి పండించారు. క్వింటాల్ విత్తనం కోసం రైతులు 12 వేలు చెల్లించారు. సాగు ప్రారంభించినప్పటి నుంచి ఎరువులు‌‌, కలుపు, పురుగు మందులు పిచికారీ చేసి తెగుళ్లను నివారించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దిగుబడి ఆశానజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి కనీసం 30 బస్తాలు వస్తే... 10 క్వింటాళ్లు విక్రయించిన రైతుకు 50 వేలు మిగులుతుందన్నారు. కానీ, ప్రస్తుతం ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు రావటమే కష్టంగా మారిందన్నారు. పంటను విక్రయించగా వచ్చిన సొమ్ముతో కూలీలకు కూలీ చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితి దారుణంగా ఉంది..

ప్రస్తుతం పల్లికి 7 నుంచి 8 వేలు ధర పలుకుతుంది. వేరుశనగ సాగు చేయటానికి అధిక పెట్టుబడులు అవుతుండగా.. దిగుబడి లేకపోవటంతో అప్పులే మిగులుతున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతోందని.. ఆ పంటలు పండిస్తే పరిస్థితి దారుణంగా ఉందని అన్నదాతలు వాపోతున్నారు. ఆరుతడి పంటలకు 7 వేలకు పైగా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లేదంటే ఊరి వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

బూడిదే మిగిలేది..

నాలుగు ఎకరాల్లో 12వేల రూపాయలు పెట్టి విత్తనాలు కొని వేరుశనగ వేశాం. 50బస్తాల వేరుశనగ పండింది. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగినయి. రూ.400 ఇవ్వకపోతే కూలీలు వస్తలేరు. మెషీన్​కు వేయాలంటే ఎకరాకు 5వేలు తీసుకుంటున్నారు. ఎరువుల కోసం బాగా ఖర్చువుతోంది. మచ్చతెగులు వచ్చి మందు కొడితే.. మంచు కురవడం వల్ల బూడిద తెగులు తాకి వేరుశనగ దిగుబడి వస్తలేదు. తెగుళ్లు తాకి కాయలు భూమిలోనే రాలిపోతున్నయి. మక్కలు, వరి వేయొద్దు అని చెప్పారు.. మీరు చెప్పినట్లు చేసినందుకు మాకు బూడిదే మిగిలేది. మాకు ప్రత్యామ్నాయం చూపించాలి. -వేరుశనగ రైతు

పండించినా లాభం లేదు..

20 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. 210 బస్తాలు పండింది. క్వింటా రూ.11వేల చొప్పన 20 క్వింటాల విత్తనాలు కొనుగోలు చేశా. అప్పుడు 11 వేలకు కొంటే.. ఇప్పుడేమో రూ.6,500కే కొనుగోలు చేస్తున్నారు. మక్కలు వేయొద్దు.. యాసంగిలో వరి వేయొద్దన్నారు. మరి మేం ఇప్పుడు ఏం చెయ్యాలే. మద్దతు ధరకు కూడా కొనట్లేదు. పండించినా లాభం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. -కౌలు రైతు

దిగుబడి లేకపోవడంతో..

వనపర్తి జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. ఇక్కడ పండే పల్లికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి అన్నారు. దేశం నలుమూలల నుంచి ట్రేడర్స్ వచ్చి టెండర్లు వేస్తారని తెలిపారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు వేసిన ధరలు సంతృప్తికరంగా ఉన్నా.. దిగుబడి లేకపోవడంతో అన్నదాతలకు అప్పులే మిగులుతున్నాయని పేర్కొన్నారు.

వనపర్తి పల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

వనపర్తి ప్రాంతంలో పండిన వేరుశనగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ పండే పల్లీల్లో అప్లోటాక్సిన్ అనే శిలీంద్ర రసాయనం ఉండదు. అందువల్ల ఇక్కడే పండే పల్లీలను వ్యాపారులు దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా యూరోపియన్​ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఈ మార్కెట్​కు ఇక్కడి ట్రేడర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ట్రేడర్స్​ వస్తారు. వనపర్తి మార్కెట్​లో రైతులకు అధిక ధర లభిస్తుంది. గత సంవత్సరంలో క్వింటాలుకు రూ.8,400 అధిక ధర పలికింది. ఈ సీజన్​లో ఇప్పటివరకు 8,400 అత్యధిక ధర పలికింది. -లక్ష్మారెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌

ఇదీ చదవండి:

Revanth reddy on KCR: 'వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్​.. ఫామ్​హౌజ్​లో ఎలా పండిస్తున్నారు.?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.