ETV Bharat / state

పాస్​పోర్ట్ సేవలు ప్రారంభం - passport office in wanaparthi

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రజలకు నేటి నుంచి పాస్​పోర్టు కష్టాలు తీరనున్నాయి. జిల్లాల్లోనూ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నూతన కార్యాలయం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

పాస్​పోర్ట్​ అందజేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Feb 28, 2019, 8:54 PM IST

పాస్​పోర్ట్​ అందజేస్తున్న ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పాస్​పోర్ట్ కార్యాలయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12 పాస్​పోర్ట్ కేంద్రాలు ఉన్నాయని అందులో వనపర్తి ఉండడం సంతోషకరమన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి. ప్రజలు గతంలో పాస్​పోర్ట్ పొందేందుకు బాగా ఇబ్బందులు పడేవారని... ఇప్పుడా సమస్య తీరిందన్నారు.
undefined
రోజుకు 40 పాస్​పోర్టుల జారీ
ఇక్కడి నుంచి రోజుకు 40 పాస్​పోర్టు​లను అందించే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఈ ​ కార్యాలయాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని నంది ఎల్లయ్య పేర్కొన్నారు. అత్యవసరంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారికి వారం రోజుల్లోనే పాస్​పోర్ట్ పొందేందుకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.