వనపర్తి జిల్లా నాగవరంలో సింధూజ కోచింగ్ సెంటర్లో రెండో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈనెల 3న కరస్పాండెంట్ కొట్టాడని.. 5న తీవ్ర జర్వంతో ఉన్న బాలుడిని ఆసుపత్రిలో చూపించామని తల్లిదండ్రులు తెలిపారు. సరిగ్గా చదవడం లేదని కరస్పాండెంట్ కొట్టడం వల్లే చనిపోయాడంటూ ఆరోపించారు. మృతదేహంతో కోచింగ్ సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని బైఠాయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి మృతదేహాన్ని.. జిల్లా ఆసుపత్రి శవగారానికి తరలించారు.
ఇవీ చూడండి: విద్యుత్ తీగలు తగిలి తగలబడ్డ లారీ