వందకు....5వందలు ఇది బెట్టింగ్ కాదు. వనపర్తి జిల్లా అమరచింతలోని ఓ ఏటీఎంలో వంద రూపాయలు డ్రాచేస్తే 500 రూపాయలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎంను బంద్ చేశారు. 100 రూపాయల నోట్లు పెట్టాల్సిన అరలో 500 రూపాయల నోట్లు పెట్డడం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.
ఏటీఎం నుంచి 5 లక్షల 88వేల రూపాయలు అదనంగా డ్రా అయినట్లు గుర్తించిన బ్యాంక్ అధికారులు డబ్బులు డ్రా చేసుకున్న వారి నుంచి తిరిగి రికవరీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 8 నెలల గర్భిణీ అయినా.. కరోనా రోగులకు సేవలు..