రైతులు నియంత్రిత వ్యవసాయ సాగుపై దృష్టి పెట్టి.. లాభసాటి పంటలు పండించాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా పానగల్, వీపనగండ్ల మండలాల్లో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేశారు.
సాగుపై రైతులకు సలహాలు
పానగల్ తహసీల్దార్ కార్యాలయంలో నియంత్రిత వ్యవసాయ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సలహాలు, సూచనలు చేశారు. మండల కేంద్రంలోని 55 మంది లబ్ధిదారులకు 60 లక్షల కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు నియంత్రిత వ్యవసాయ సాగుపై దృష్టి పెట్టి లాభసాటిగా పంటలు పండించాలని ఎమ్మెల్యే అన్నారు.
రైతును రాజు చేస్తాం
అన్నం పెట్టే రైతు దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్య ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో ఛైర్మన్లు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్