వనపర్తి జిల్లా పరిధిలోని ప్రతీ చెరువును నీటి నింపి... ఏళ్లుగా బీడు పడి ఉన్న భూముల్లో సైతం సిరులు పండిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలం, గోపాల్పేట మండలంలోని కల్వకుర్తి ఎత్తిపోతల కుడి కాలువను పరిశీలించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ... కాలువ పనులను పర్యవేక్షించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎత్తిపోతల ద్వారా ప్రతీ గ్రామానికి ఏర్పాటు చేసిన ప్రధాన కాల్వలను వారానికోసారి పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. జంగమయ్యపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, సోలిపురం, దొడగుంటపల్లి గ్రామాలను సందర్శించారు. రెడ్డిపల్లిలో రైతులు ఏర్పాటు చేసుకుంటున్న పైపులైన్లను పరిశీలించి తన వంతు సహకారం అందిస్తానని నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!