వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో వనపర్తిలో పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
హోం క్వారంటైన్‌లో ఉండాలి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను వనపర్తిలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్