ETV Bharat / state

'మీ ప్రతినిధిగా నేను పదవిలో ఉన్నానాన్న మంత్రి'

మీ ప్రతినిధిగా నేను పదవిలో ఉన్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

minister niranjan reddy said I am in office as your representative
మీ ప్రతినిధిగా నేను పదవిలో ఉన్నానాన్న మంత్రి
author img

By

Published : Aug 9, 2020, 4:28 PM IST

మీ ప్రతినిధిగా నేను పదవిలో ఉన్నానాన్న మంత్రి

మీరు నాకిచ్చిన అవకాశంతో మీకోసం పనిచేస్తున్నాను.. మీలో నన్ను చూసుకుంటున్నా.. నన్ను మీ స్నేహితుడుగా భావించి పని తీసుకోండని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. వేరుశనగ దిగుబడిలో మన ప్రాంతంలో దేశంలోనే రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయన్నారు. భవిష్యత్​లో ఈ దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

కేఎల్​ఐ నుంచి సాగునీటి రాకతో ఈ ప్రాంతంలో పంటల సాగు పెరిగిందన్నారు. ప్రజల కోసం పనిచేశామని, వారికి ఉపాధి కల్పించినందుకు ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాలకు నీళ్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీల ఛైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.