వనపర్తి జిల్లాలో ఉన్న 393 ఆవాసాల్లోని ప్రతి ఇంటికి... ఐదు మున్సిపాలిటీలతోపాటు జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు చేరేలా కనెక్షన్లు ఏర్పాటు చేయాలని.. మంత్రి సూచించారు. మిషన్ భగీరథ తాగునీరు వాడకాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ స్థిరీకరణ పనులు పూర్తిగా వచ్చాయని తుదిదశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అయ్యేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: 'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'