ETV Bharat / state

'రాష్ట్ర వ్యాప్తంగా ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు' - wanaparthi district latest news

రాష్ట్ర వ్యాప్తంగా ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా రాజాపేట, కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రబీకి సంబంధించి మొదటి కొనుగోలు కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Minister Niranjan Reddy inaugurated grain procurement center
'రాష్ట్ర వ్యాప్తంగా ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు'
author img

By

Published : Apr 5, 2020, 12:32 PM IST

ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైనట్లు మంత్రి వివరించారు. వనపర్తి జిల్లా రాజాపేట, కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కోసం ఏడు వేల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఐకేపీ, పీపీఎస్​ల ద్వారా పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్ నేపథ్యంలో రైతులంతా ఒకేసారి రాకుండా ప్రతి పంచాయతీలోనూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొంటామని వెల్లడించారు. ముఖ్యంగా రైతులు ఎలాంటి పాసుపుస్తకాలు చూపించాల్సిన అవసరం లేదని... బ్యాంకు ఖాతా నెంబరు వివరాలు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ లోకనాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, ఎంపీపీ కిచ్చా రెడ్డి, వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

'రాష్ట్ర వ్యాప్తంగా ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు'

ఇదీ చూడండి: పనులు ఆగితే ఖరీఫ్‌లో విక్రయాలకు కొరత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.