వనపర్తి జిల్లా శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లోని పలు గ్రామాలలో బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఐక్యతకు పాటుపడుతోందని అందులో భాగంగానే కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలందరూ ఐక్యతగా ఉండాలని సూచించారు.
శ్రీరంగాపురం మండల కేంద్రం, కంబాలపురం, వెంకటాపురం, జానంపేట, పాతపల్లి, అయ్యవారిపల్లి, తిప్పాయిపల్లి, యాపర్ల, పాత సూగూరు, తోమాలపల్లి, శాఖాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు