వనపర్తి జిల్లా అంకూర్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొదటగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికి గుంటలు ఎక్కువగా ఉండటం వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం గ్రామ సమీపంలో శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ కిషన్రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి;పులిచింతలకు భారీగా వరద నీరు