'ఆడపిల్ల చదువుకోవాలని కృషి చేసిన మహనీయుడు ఫూలే' - Mahatma Jyotiba Phule jayanthi
వనపర్తి జిల్లాలో మహాత్మ జ్యోతిబా ఫూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ యాస్మిన్ బాష పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని కృషి చేసిన గొప్ప మహనీయుడు ఫూలే అని కలెక్టర్ కొనియాడారు.
150 ఏళ్ల క్రితమే కుల వివక్షత గురించి పోరాటం చేసిన మహనీయులు మహాత్మ జ్యోతిబా ఫూలే అని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష కొనియాడారు. కలెక్టరేట్లో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహిళలు చదువుకోవాలనే ఆశయంతో భార్య సావిత్రిబాయి ఫూలేను చదివించి.. మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన ఘనత పూలేకే దక్కిందని కలెక్టర్ పేర్కొన్నారు. నాడు మహిళలు చదువుకునేందుకు పడ్డ నాంది నేటివరకు కొనసాగుతోందని వెల్లడించారు. అందుకే నేడు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేస్తూ ఉన్నత చదువులు చదవనివ్వకుండా చేస్తున్నారని కలెక్టర్ ఆవేదన చెందారు. అలాంటి సంస్కృతికి స్వస్తి చెప్పి ప్రతి ఆడపిల్లను చదివించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'తెరాస సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది'