రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని... రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం పెద్దదగడ, దగడపల్లి, వెలుగొండ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతులకు టోకెన్లు ఇచ్చిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రైతులందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
అనంతరం చిన్నాంబావి మండల కేంద్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట రమణమ్మ పాల్గొన్నారు. ఇదీ చూడండి: మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు