వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో పెబ్బేరు మండలం పెంచికలపాడు ప్రాదేశిక స్థానానికి చెందిన బ్యాలెట్ పత్రాలు కదిరేపాడుకి రావడం వల్ల పేర్లు తారుమారయ్యాయి. 64వ బూతులో 587 ఓట్లుండగా 501 ఓట్లు పోలయ్యాయి. జరిగిన పొరపాటును సరిచేస్తూ ఎన్నికల సంఘం ఇవాళ రీపోలింగ్ జరిపేందుకు తేదీని ఖరారు చేసింది. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః 'ఎన్నికల పండుగలో మేము సైతం'