వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులోని రైతు ఆంజనేయులు తల్లి పేర ఎకరా 26 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సర్వే చేయాలంటూ ఆంజనేయులు కొద్ది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపం చెందిన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు... మంటలను ఆర్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: 2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు