వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కేతపల్లి, బండపల్లి, తెలరాళ్లపల్లి గ్రామాల రైతులు సాగు నీటి కోసం ధర్నాకు దిగారు. గ్రామాల్లో పంటపొలాలకు నీరందడం లేదని... చేతికందొచ్చిన పంట ఎండిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
బీమా, కేఎల్ఐ కాలువల కింద సుమారు నాలుగువేల ఎకరాల పంట మాడిపోతోందన్నారు. చివరిదశలో ఉన్న పంట పశుగ్రాసంగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం