వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి సమీపంలో ఉన్న రామన్‌పాడ్ వెనుక జలాల్లో సంచిలో ఇరుక్కుని మృతి చెందిన మొసలి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు ఖననం చేశారు. సంచిలో ఇరుక్కున్న మొసలి ఊపిరాడక మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారి బాలు తెలిపారు.
వాగు సమీపంలోనే మొసలి కళేబరానికి పంచనామా నిర్వహించి ఖననం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ ఖాజ, సర్పంచ్ అరుణ, రమేష్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా పాజిటివ్