ఆధార్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
నూతన ఆధార్ కార్డుల నమోదు, పేరులో మార్పులు, పుట్టిన తేదీ మార్పులు తదితర సమస్యలను ఆధార్ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. నిర్వాహకులు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని సూచించారు.