విద్యార్థి దశ నుంచే సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించాలని ప్రధానోపధ్యాయులకు కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ టీచర్ వన్డే ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత, కేజీబీవీ, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు క్లబ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బాలికలు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై సఖీకేంద్రం ప్రదర్శించిన చార్ట్‌ను పరిశీలించి... అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: అన్న కోసం తమ్ముడి ఆత్మహత్య..మూడేళ్ల తర్వాత దొరికిన శవం..