ETV Bharat / state

గబ్బర్​సింగ్​ పెళ్లి సీన్​ రిపీట్​... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు

సరిగ్గా... తాళి కట్టే సమయంలో "ఆపండి..." అనే మాట వినిపిస్తోంది. అప్పటి వరకు ఎంతో కోలాహలంగా ఉన్న మండపం ఆ మాటతో నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇదీ చాలా సినిమాల్లో వినిపించే మాట... కన్పించే దృశ్యం. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ సినిమా గబ్బర్​సింగ్​లోని పెళ్లి సన్నివేశం వనపర్తిలో రిపీటయ్యింది. ఇక్కడ... ఆపండి అన్నది మాత్రం పెళ్లికూతురేనండోయ్​...! కారణమేమిటంటే...

BRIDE WALKED OUT FROM MARRIAGE WHEN HER FRIEND CAME

author img

By

Published : Feb 29, 2020, 9:24 AM IST

వధూవరులిద్దరి బంధువులు, ఇరు కుటుంబాల పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ముహూర్తం. పెళ్లి తంతు మొదలైంది. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ వధువు తలపై జీలకర్ర, బెల్లం పెట్టమని వరుణ్ని పురమాయించారు. ఇంతలో ఆమె ఒక్కసారిగా కేక పెట్టింది. ‘'ఆపండి.. ఈ పెళ్లి నాకిష్టం లేదు’' అంటూ పెళ్లిపీటల నుంచి పక్కకు వచ్చేసింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమ్మాయి కుటుంబం చాలా రోజుల క్రితమే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో స్థిరపడింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో పెద్దలు ఆమెకు పెళ్లి తలపెట్టారు. షోలాపూర్‌ నుంచి వధువు స్నేహితుడు పెళ్లికి వచ్చాడు. అతడిని చూడగానే వధువు తనకీ పెళ్లి ఇష్టం లేదంటూ మొండికేసింది. ఈ పరిణామంతో నివ్వెరపోయిన బంధువులు... స్నేహితుడిపై దాడికి దిగారు. బంధువుల నుంచి స్నేహితుడు తప్పించుకొని పారిపోయాడు. మొత్తానికి పీటలమీద పెళ్లి ఇలా ఆగిపోయింది.

గబ్బర్​సింగ్​ పెళ్లి సీన్​ రిపీట్​... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.