దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుధీర్ఘంగా చర్చించిన తర్వాతే కేంద్రం.. నూతన సాగు చట్టాలను అమలు చేసిందని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఈ చట్టాలతో రైతులకు లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రైతులకు సాగు చట్టాలపై అవగాహన కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. రైతు చట్టాలపై మోదీ మాట్లాడిన ప్రసంగాన్ని దృశ్యరూపకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చూపించారు. నూతన సాగు చట్టాలపై రైతులకు లేనిపోని అపోహలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై వివేక్ మండిపడ్డారు.
- ఇదీ చూడండి : గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు