ETV Bharat / state

Attack on JC: 'జేసీ'పై చేయిచేసుకున్న వ్యక్తి.. ఇంకెన్నాళ్లంటూ..! - joint collector venugopal latest news

Attack on JC: వనపర్తి జిల్లా జాయింట్​ కలెక్టర్​పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. తన సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదంటూ దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Attack on JC: 'జేసీ'పై చేయిచేసుకున్న వ్యక్తి.. ఇంకెన్నాళ్లంటూ..!

author img

By

Published : May 2, 2022, 3:30 PM IST

Attack on JC: వనపర్తి జిల్లా జాయింట్​ కలెక్టర్​ వేణుగోపాల్​పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే 'ప్రజావాణి' సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన శివకుమార్ అనే వికలాంగుడు ప్రజావాణికి హాజరయ్యాడు. తనకు వచ్చే వికలాంగ పింఛన్​ మధ్యలో ఆగిపోయిందని.. తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ గత మూడు, నాలుగు ప్రజావాణి కార్యక్రమాలకు హాజరవుతున్నాడు.

అధికారులకు పలుమార్లు తన సమస్యను విన్నవించుకున్నా.. పరిష్కారం కావడం లేదని, తనకు వచ్చే పింఛన్​ డబ్బులు ఆగిపోవడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయాడు. ఈ క్రమంలోనే ఇంకెన్నాళ్లు తన సమస్య పరిష్కారం కాదంటూ జేసీతో వాగ్వాదానికి దిగాడు. అంతలోనే జేసీపై చేయి చేసుకున్నాడు. గమనించిన పోలీసులు.. వెంటనే శివకుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించారు.

ఇవీ చూడండి..

గుడిసెను తగులబెట్టేసిన కొవ్వొత్తి.. 80 ఏళ్ల వృద్ధుడు సజీవదహనం

'కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.