తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమకు వేతనం రూ. 10వేలు చెల్లించాలని కోరారు. పనిభారం తగ్గించి.. పారితోషికం లేని పనులకు ఆశా కార్యకర్తలను ఉపయోగించుకోరాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు...