ETV Bharat / state

ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలి : నిరంజన్​ రెడ్డి - వనపర్తి జిల్లా వార్తలు

వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో నుంచి పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఐదో వార్డులో చర్చిలో నిర్వహించిన క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్​ కట్​ చేసి క్రైస్తవులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలి: నిరంజన్​ రెడ్డి

author img

By

Published : Dec 18, 2020, 3:05 PM IST

ప్రజలందరూ కుల, మతాలకతీతంగా ఐకమత్యంతో మెలగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి సూచించారు. ఇతరుల విశ్వాసాలను గౌరవించాలని తెలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రం నుంచి జగద్గిరిగుట్ట, కొల్లాపూర్​కు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఐదోవార్డులో పర్యటించి.. చర్చిలో కేక్​కట్​ చేసి క్రైస్తవులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

చర్చిల్​ కేక్​ కట్​ చేసిన మంత్రి నిరంజన్​ రెడ్డి
క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్​ రెడ్డి

సమాజానికి మంచి పౌరులను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా మైనారిటీ శాఖ అధికారి అనిల్​కుమార్, మున్సిపల్ ఛైర్మెన్ గట్టుయాదవ్, పుర కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'మార్చి నాటికి ప్రతి పల్లెకు తాగునీరు అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.