శంకర సముద్రం ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తిచేసి గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓ యువకుడి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి సమీపంలో 13 ఏళ్ల క్రితం శంకర సముద్రం ఎత్తిపోతల పథకం చేపట్టారు.
నేటికీ పనులు అసంపూర్తిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు పునరావాస సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రకు పూనుకున్నాడు.
స్థానిక ప్రజాప్రతినిధులకు సమస్యలు విన్నవించినా.. నేటికీ పునరావాసంలో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్కు పాదయాత్ర ద్వారా చేరుకుని సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఇదీ చదవండి:అక్కడ పెట్రోల్ సెంచరీ కొట్టేసింది!