ETV Bharat / state

వంటకాలతో ఉపాధి.. కొత్తకోట నారీమణుల ఐడియా అదుర్స్!

వాళ్లంతా సాధారణ గృహిణులు. ఏటా వినాయక నవరాత్రులకు అన్నదానం కోసం రకరకాల వంటకాలు చేసి పెట్టేవాళ్లు. అదేదో రోజూ చేస్తే కాస్త ఆదాయం సంపాదించుకోవచ్చు కదా అని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా అమలు పరిచారు. ఇంట్లో పండగలకు పబ్బాలకు, శుభకార్యాలకు చేసే వంటకాల్ని ఆర్డర్లపై తయారు చేస్తూ... ఒక్కోమహిళ నెలకు 8 నుంచి 10 వేల వరకూ సంపాదిస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన 8 మంది మహిళలు ఇంటి వంటకాల్ని తయారు చేస్తూ ఆదాయం గడిస్తున్న తీరుపై ఈటీవీ ప్రత్యేక కథనం.

A special STORY on the women of Kottakota, Vanaparthi district
వంటకాలతో ఉపాధి.. కొత్తకోట నారీమణుల ఐడియా అదుర్స్!
author img

By

Published : Mar 8, 2023, 8:41 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన 8మంది మహిళలు శ్రీ విఘ్నేశ్వర హోమ్ పుడ్స్ పేరిట ఇంటి వంటకాల్ని ఆర్డర్లపై తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇరుగుపొరుగుకు చెందిన 8మంది మహిళలు … ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలకు అన్నదానం సహా భక్తుల కోసం రకరకాల వంటకాల్ని చేసి పెట్టేవాళ్లు . 11 రోజుల పాటు అంతా కలిసి ఉత్సవాల కోసం పనిచేసే వాళ్లు. ఆ పనేదో రోజూ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వారిలో మెరిసింది. అనుకున్నదే తడవుగా వాళ్లంతా కలిసి ఏఏ వంటకాలు చేయగలరో నమూనాలు చేసి వాట్సప్ గ్రూపుల్లో పంచుకున్నారు. ఆర్డర్లపై ఆ వంటకాలు చేస్తామని ప్రచారం చేశారు. గ్రూపుల్లో ఇలా పంచుకున్నారో లేదో ఆలా అర్డర్లు వచ్చిపడ్డాయి.

మేం అప్పట్లో వినాయకుని ప్రసాదాలు చేసేవాళ్లం. అయితే అలా ఆలోచన పుట్టింది. అందరం కలిసి చేస్తున్నాం. మూడు, నాలుగు నెలలుగా చేస్తున్నాం. వాట్సాప్‌లో పెట్టేవాళ్లం. పెట్టగానే అర్డర్స్ వచ్చాయి. అందుకే సక్సెస్ అయింది. మా దగ్గర అన్ని రకాల వంటకాలు దొరుకుతాయి. కొంతమందికి చేసుకునే ఓపిక ఉండదు. అలాంటి వారికి ఇవి ఉపయోగపడుతాయి. శుభకార్యాలకు, హాస్టల్స్‌కు, ఈవెంట్లకు అన్నింటి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాన్ వెజ్ కూడా వండుతాం. మేం ఎనిమిది మందిమి ఉన్నాం. రెగ్యూలర్‌గా 10 ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఒక్కోక్కరికి 10 వేల దాకా ఆదాయం వస్తుంది. - మహిళలు

చాలామంది దగ్గర డబ్బుంటుంది కానీ తీరిక లేదు. ఎంతోమందికి చేసుకుని తినాలనే ఆశ ఉంటుంది. కానీ చేసే శక్తి ఉండదు. రుచికరమైన వంటలు చేయాలని ఉంటుంది కాని ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ల గురించి ఆలోచించి వారి అవసరాలను తీర్చడంతో పాటు తాము కొంత ఆదాయాన్ని సంపాదించేందుకే ఈ ఇంటి వంటకాల్ని ప్రారంభించమంటారు ఆ మహిళలు. ఆర్డర్ పై మురుకులు, గారెలు, అరిసెలు, బక్షాలు లాంటి తినుబండారాలు చేసి పెడతారు. వీటితో పాటు రోజూ తినే రొట్టెలు, పెద్దమొత్తంలో ఆర్డరిస్తే మటన్, చికెన్ వంటకాలు సైతం చేస్తారు. ఇంటి రుచుల్ని గుర్తుచేసే ఈ వంటకాల్ని వినియోగదారులు కోరుకున్నట్లుగా అందివ్వటం వీరి ప్రత్యేకత.

4 నెలల్లో సుమారు 6లక్షల విలువైన ఆర్డర్లు చేసి పెట్టారు. తద్వారా నెలకు సగటున ఒక్కో మహిళ 8 నుంచి 10వేల వరకూ సంపాదిస్తున్నామని చెబుతున్నారు. గతంలో ఇంట్లో ఉండి అదే సమయాన్ని వృధాచేశామని, ఇప్పుడు అదే సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపాదిస్తున్నామంటున్నారు. పండగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర మహిళలకు సైతం ఉపాది కల్పిస్తున్నారు. ఆర్డర్లు పెరిగితే వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ పై రుణాలు లేదా ప్రోత్సహాకాలు అందిస్తే మరింత మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు కొత్తకోట నారీమణులు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.