ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు తమ తమ డిపోలకు తరలివస్తున్నారు. అమరులైన కార్మికులకు నివాళులు అర్పించి... విధుల్లో చేరుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో వద్ద కార్మికుల సందడి నెలకొంది. అధికారులు వారిని విధులకు అనుమతించడంతో ఉదయం నుంచే బస్సులు రోడ్లపైకి వచ్చాయి.
ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధులకు అనుమతించడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీకి వంద కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పరిగిలోనూ...
మరోవైపు పరిగి డిపో వద్ద సైతం ఉదయం నుంచే కార్మికులు విధులకు హాజరయ్యేందుకు తరలివచ్చారు. ఇప్పటికే సుమారు 100 మంది కార్మికులు విధుల్లో చేరినట్లు డిపో మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. తమ వేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
52 రోజుల సమ్మె అనంతరం శాశ్వత ఆర్టీసీ ఉద్యోగులతో బస్సులు రోడ్లపైకి వచ్చాయి.
ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు