ETV Bharat / state

'వికారాబాద్​ జిల్లాలో పుర ఎన్నికల కోసం సర్వం సిద్ధం' - ఎన్నికలు

వికారాబాద్ జిల్లాలో పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా చక్రాల కుర్చీలు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామన్నామని జిల్లా కలెక్టర్ మస్రత్ కానం అయేషా పేర్కొన్నారు.

Vikarabad_Municipal_Elections
వికారాబాద్​లో పుర ఎన్నికల కోసం సర్వం సిద్ధం
author img

By

Published : Jan 21, 2020, 7:38 PM IST

పురపాలక ఎన్నికల కోసం వికారాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుతాయని తెలిపారు.

జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నాలుగు పురపాలక సంఘాలున్నాయి. ఈ ఎన్నికల్లో 1,42,925 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 71,348 మంది, మహిళలు 71,576 మంది ఓటర్లు ఉన్నారు. 97 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా వీటిలో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా... మిగిలిన 95 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పురపాలక ఎన్నికల్లో 361 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సర్వం సన్నద్ధం

నాలుగు పురపాలక సంఘాల్లో కలిపి 224 పోలింగ్ స్టేషన్లు ఉండగా...అందుకు1,195 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. 29 మంది నోడల్ అధికారులను కేటాయించారు. పురపాలక సంఘ ఎన్నికల్లో 62 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్​ను ఏర్పాటు చేశారు. ఇంటర్ నెట్ సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పోలీసు బందోబస్తును వినియోగిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల్లో 667 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు.

వికారాబాద్​ మున్సిపాలిటీలో

వికారాబాద్ పురపాలక సంఘంలో 34 వార్డుల్లో 52,450 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 26, 290 మంది పురుషులు, 26,160 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో రెండు వార్డులు ఏకగ్రీవం కావడం వల్ల 32 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 64 పోలింగ్ కేంద్రాలు..18 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు 28 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

పరిగిలో..

పరిగి పురపాలక సంఘంలో 15 వార్డుల్లో 17, 223 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8867 మంది పురుషులు, 8356 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 30 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆరుగురు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు 10 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తాండూరులో...

తాండూరు పురపాలక సంఘంలో 36 వార్డుల్లో 63,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 31, 268 మంది పురుషులు, 32,067 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు 20 వెబ్ కాస్టింగ్ కెమెరాలు వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో 20 మంది మైక్రో అబ్జర్వర్లు, 9 మంది ఆర్​వోలు, 120 మంది పీఓలు, 120 మంది ఏపీఓలు విధులు నిర్వహిస్తున్నారు.

కొడంగల్​లో...

కొడంగల్ పురపాలక సంఘంలో 12 వార్డుల్లో 9,989 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,964 మంది పురుషులు, 5,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. పోలింగ్​ కోసం ముగ్గురు మైక్రో అబ్జర్వర్లు, ముగ్గురు ఆర్ఓలు, 26 మంది పీఓలు, 26 మంది ఏపీఓలతో పాటు 76 మంది ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు 3 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

వికారాబాద్​లో పుర ఎన్నికల కోసం సర్వం సిద్ధం

ఇవీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

TG_HYD_41_21_VIKARABAD_MUNICIPAL_ELECTION_PKG_3182388_TS10027 reporter : sripathi.srinivas note : TG_HYD_VKB_31_21_POLLING_DISTRIBUTION_AB_TS10027 ఫైల్ పేరుతో ఫీడ్ వచ్చింది. ( ) వికారాబాద్ జిల్లాలో పురపాలక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా చక్రాల కుర్చీలను, ఓటర్ల కోసం మంచినీటి సదుపాయాన్ని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 224 పోలింగ్ కేంద్రాలకు 1,195 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లాలో 61 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామన్నామని జిల్లా కలెక్టర్ మస్రత్ కానం అయేషా పేర్కొన్నారు. Look..... వాయిస్ : పురపాలక ఎన్నికల కోసం వికారాబాద్ జిల్లా అధికారులు సర్వం సిద్దంచేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పురపాలక సంఘ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నాలుగు పురపాలక సంఘాలున్నాయి. ఈ ఎన్నికల్లో 1,42,925 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 71,348 మంది, మహిళలు 71,576 మంది ఓటర్లు ఉన్నారు. 97 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా వీటిలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వికారాబాద్ మున్సిపాలిటీలోని 14 వార్డులో తెరాస అభ్యర్థి రామస్వామి, 24వ వార్డు అభ్యర్థి చిగుళ్లపల్లి మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 95 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పురపాలక ఎన్నికల్లో 361 మంది అభ్యర్థులు పోటి చేస్తున్నారు. నాలుగు నగరపాలక సంఘాల్లో కలిపి 224 పోలింగ్ స్టేషన్లు ఉండగా...అందుకు1,195 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. 29 మంది నోడల్ అధికారులను కేటాయించారు. పురపాలక సంఘ ఎన్నికల్లో 62 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. వీటిలో తాండూరులో 20, కొడంగల్ లో 4, పరిగిలో 10, వికారాబాద్ లో 28 వెబ్ కాస్టింగ్ లు వినియోగిస్తున్నారు. బైట్ : మస్రత్ కానం అయేషా, వికారాబాద్ జిల్లా కలెక్టర్. వాయిస్ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పోలిసు బందోబస్తును వినియోగిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల్లో 667 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. వీరిలో నలుగురు డిఎస్పీలు, 8మంది సీఐలు, 42 మంది ఎస్సైలు, 76 మంది ఏఏస్సైలు, 248 మంది హెడ్ కానిస్టేబుళ్లు , 135 మంది పోలిసు కానిస్టేబుళ్లు, 56 మంది హోంగార్డులు పాల్గొంటారు. వీరితో పాటు మూడు ప్లాటూన్ల ఆర్ముడ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 64 మంది బైండోవర్ చేశామని, 450 లైసెన్స్ డ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇంటర్ నెట్ సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాయిస్ : వికారాబాద్ పురపాలక సంఘంలో 34 వార్డుల్లో 52,450 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 26, 290 మంది పురుషులు, మహిళలు 26,160 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో రెండు వార్డులు ఏకగ్రీవం కావడంతో 32 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కోసం 64 పోలింగ్ కేంద్రాలు..18 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు 28 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు జోన్లలో ఆరు రూట్లలో 22 వాహనాలు కేటాయించారు. వీటి కోసం 11 మంది ఆర్.ఓలను నియమించారు. 64 మంది ఏపీఓలు విధుల్లో పాల్గొంటారు. 40 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. వాయిస్ : పరిగి పురపాలక సంఘంలో 15 వార్డుల్లో 17, 223 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8867 మంది పురుషులు, 8356 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 30 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆరుమంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు 10 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మూడు జోన్ లలో మూడు రూట్లలో 8 వాహనాలు ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆర్.ఓలు విధుల్ల్లో పాల్గొంటున్నారు. వాయిస్ : తాండూరు పురపాలక సంఘంలో 36 వార్డుల్లో 63,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 31, 268 మంది పురుషులు, 32,067 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 20 మంది మైక్రో అబ్జర్వర్ల, 9 మంది ఆర్.ఒలు, 120 మంది పీఓలు, ఏపీఓలు 120 మంది ఏపీఓలు విధులు నిర్వహిస్తున్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు 20 వెబ్ కాస్టింగ్ కెమెరాలు వినియోగిస్తున్నారు. 12 జోన్లలో, 9 రూట్లలో 18 వాహనాలు ఏర్పాటు చేశారు. వాయిస్ : కొడంగల్ పురపాలక సంఘంలో 12 వార్డుల్లో 9,989 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,964 మంది పురుషులు, 5,025 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 22 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఎన్నికల కోసం 3 మైక్రో అబ్జర్వర్లు, ముగ్గురు ఆర్.ఓలు, 26 పీ.ఓలు, 26 మంది ఏపీఓలతో పాటు 76 మంది ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు 3 వెబ్ కాస్టింగ్ కెమెరాలు వాడుతున్నారు. 4 జోన్లలో నాలుగు రూట్లలో 6 వాహనాలు వాడుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.