వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పర్యటించారు. ఆస్తుల వివరాల నమోదును పరిశీలించిన ఆమె.. వీలైనంత త్వరగా ధరణి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్స్ను పరిశీలించారు. మూత్రశాలలు, ఆ చుట్టపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
కూరగాయల మార్కెట్లోని మాంసం దుకాణాలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం