వికారాబాద్ జిల్లా పరిగిలో కలెక్టర్ పౌసుమి బసు అకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని సమస్యలపై ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనుల జాప్యం, నాణ్యత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి పూర్తయ్యేలోపు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన