ETV Bharat / state

Suspend: తుర్కయంజాల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సస్పెండ్​ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

తుర్కయంజాల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ అహ్మద్ ష‌ఫీ ఉల్లా సస్పెన్షన్​కు గురయ్యారు. టీఎస్ బీపాస్ ద్వారా భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల కోసం జారీ చేసిన ప‌ర్మిష‌న్ ప్రొసీడింగ్‌ల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మాన్యువ‌ల్‌గా అనుమతి ఇచ్చారని నిరూపిత‌మ‌వ‌డంతో ష‌ఫీ ఉల్లాను జిల్లా క‌లెక్టర్ స‌స్పెండ్ చేశారు.

Suspend
సస్పెండ్​
author img

By

Published : Sep 5, 2021, 10:26 AM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ అహ్మద్ ష‌ఫీ ఉల్లాను స‌స్పెండ్ చేస్తూ క‌లెక్టర్ అమోయ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ బీపాస్ ద్వారా భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల కోసం జారీ చేసిన ప‌ర్మిష‌న్ ప్రొసీడింగ్‌ల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మాన్యువ‌ల్‌గా అనుమతి ఇచ్చారని నిరూపిత‌మ‌వ‌డంతో ష‌ఫీ ఉల్లాను క‌లెక్టర్ స‌స్పెండ్ చేశారు.

తుర్కయంజాల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సస్పెండ్​

క‌మ్మగూడ‌లోని స‌ర్వే నెంబ‌ర్ 253, 254లో మూడు అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి ప‌ర్మిష‌న్ తీసుకొని న‌కిలీ అనుమ‌తి ప‌త్రాల‌తో 4వ అంత‌స్తు నిర్మించుకునేందుకు క‌మిష‌న‌ర్ అనుమ‌తించిన‌ట్లు ఆరోపిస్తూ స్థానిక కౌన్సిల‌ర్ కాకుమాను సునీల్ చేసిన ఫిర్యాదుపై క‌లెక్టర్ విచార‌ణ జ‌రిపారు. దీనిపై క‌మిష‌న‌ర్ ష‌ఫీ ఉల్లాకు, టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల‌కు క‌మిష‌న‌ర్ స‌రైన స‌మాధానం ఇవ్వక‌పోవ‌డంతో ఆయ‌న‌పై స‌స్పెన్షన్ వేటు వేశారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు స‌స్పెన్షన్ ఉత్తర్వులు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Global Warming: భూమాతకు జ్వరమొస్తే అన్నీ ఉత్పాతాలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.