ETV Bharat / state

ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు - Vikarabad district news

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే నరేందర్​రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. తాగునీరు లేక తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేను నిలదీశారు.

తాగునీటి కోసం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

author img

By

Published : Feb 3, 2021, 4:54 PM IST

తాగునీటి కోసం తామంతా అల్లాడుతున్నామని ఎమ్మెల్యే ముందు గోడు వెల్లబోసుకున్నారు వికారాబాద్​ జిల్లా కొడంగల్​లోని బాలాజీనగర్​ కాలనీ వాసులు. పట్టణంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే నరేందర్​రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. వేసవి ప్రారంభానికి ముందే కాలనీలో తాగునీటికి నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు.

మిషన్ భగీరథ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యేను కాలనీ వాసులు నిలదీశారు. మరో వారం పది రోజుల్లో అన్ని పనులు పూర్తిచేసి అందరికీ తాగునీరు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా... మహిళలు శాంతించారు.

ఇదీ చూడండి: హైకమాండ్​ నిర్ణయానికి కట్టుబడి ఉంటా : జానారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.