ETV Bharat / state

అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం - Premature rain

ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వికారాబాద్​ జిల్లాలో కురిసిన వర్షాలతో వరి, మొక్కజొన్న, జొన్న, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

The farmers facing many problems with  Premature rain
అకాల వర్షం.. రైతులకు మిగిల్చింది అపారనష్టం
author img

By

Published : May 4, 2020, 10:32 AM IST

వికారాబాద్ జిల్లా పూడూరు, దోమ, కుల్కచర్ల మండలాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. మరో 15 రోజుల్లో చేతికొస్తుందనుకున్న జొన్న, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టం కావడం వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వర్షం వల్ల వరి ధాన్యం పూర్తిగా నేలరాలింది. మరో వారంరోజుల్లో పంట కోతకొచ్చే సమయంలో అకాల వర్షం తమకు రోదన మిగిల్చిందని రైతులు వాపోతున్నారు.

మరోవైపు వర్షాభావ పరిస్థితులతో అంతంతమాత్రంగా కాసిన మామిడికాయలు.. ఈదురు గాలులతో రాలిపడ్డాయి. వడగళ్లతో మామిడి కాయలకు దెబ్బ తగిలి మార్కెట్ చేరుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.