కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ఎత్తున రైతు భరోసా దీక్ష చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తెరాస ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
పూర్తిస్థాయిలో రైతులకు రుణ మాఫీ చేయాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్ రెడ్డి