ETV Bharat / state

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఇవాళ వికారాబాద్‌లో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేసీఆర్ ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం పాల్గొనే చివరి సభ కావడం వల్ల వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నుంచి దాదాపు 1.75 లక్షల మంది వస్తారని అంచనా..

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ
author img

By

Published : Apr 8, 2019, 5:13 AM IST

Updated : Apr 8, 2019, 7:23 AM IST

లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గాన్ని తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఇందుకోసమే ఈ నియోజకవర్గ సభను వికారాబాద్​లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈరోజు జరిగే సభకు సీఎం కేసీఆర్​ హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

సీఎం పాల్గొనే చివరి సభ అయ్యే అవకాశం
చేవెళ్ల నియోజక వర్గానికి ప్రాధాన్యం ఉన్నందున ఇక్కడ తప్పనిసరిగా గెలవాలని తెరాస పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో వికారాబాద్​ సభ సీఎం పాల్గొనే చివరి సభ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కేటీఆర్ పర్యవేక్షణ పనులు ​స్వయంగా చూస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశాలు జరిపారు.

పార్టీ నేతలకు సమన్యయ బాధ్యతలు
ప్రతి నియోజకవర్గం నుంచి 25వేల మంది చొప్పున మొత్తం 7 నియోజకవర్గాల నుంచి 1.75లక్షల మందిని సమీకరించాలని తెరాస ఎమ్మెల్యేలకు కేటీఆర్​ నిర్దేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు సమన్యయ బాధ్యతలు అప్పగించారు.

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ

ఇవీ చదవండి: తెలంగాణతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలి

Intro:కాంగ్రెస్ బిజెపి పార్టీల శుష్క వాగ్దానాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో నిర్వహించిన రోడ్డు షోలో ప్రసంగించారు. జాతీయ పార్టీలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ రాష్ట్రానికి ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెరాస 16 మంది ఎంపీలను గెలుచుకొని కేంద్రంలో కీలకం కాబోతుందన్నారు. కరీంనగర్ పార్లమెంటు తెరాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు చేశారు 2012లో లో కేంద్ర మంత్రి మునియప్ప లెదర్ పార్కు స్థల కేటాయింపుపై లేఖ రాయగా సత్వరం స్పందించాల్సింది ఉండగా పోలీస్ బెటాలియన్ ను రుక్మాపూర్ లో కేటాయించారని వెల్లడించారు. చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవి శంకర్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. రోడ్ షో కు భారీగా జన సమీకరణ చేపట్టటంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.

Body:రహమత్ చొప్పదండి

Conclusion:9441376632
Last Updated : Apr 8, 2019, 7:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.