పగిరి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లాలోని పగిరి మండలం రాపోలు గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయనను అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు యువకులతో వాగ్వాదానికి దిగారు.
గ్రామం నుంచి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారిని వెంటనే బాగు చేయించాలని యువకులు ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని యువకులను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇదీ చదవండి: Lockdown: లాక్‌డౌన్ ఉల్లంఘనులపై పోలీసుల మల్లగుల్లాలు