ETV Bharat / state

చెత్త సేకరణ భళా.. పల్లెలు కళకళ - కుల్కచర్ల మండలంలో స్వచ్ఛ కార్యక్రమాలు

వీధుల్లో చెత్త.. ఇళ్ల మధ్యన చెత్త.. రోడ్ల పక్కన చెత్త.. ఎక్కడ చూసినా చెత్తే కన్పించే పరిస్థితి అది. నెలల తరబడి రోడ్ల పక్కన అలాగే కనిపించేది. ఎవరైనా జిల్లా అధికారులు పర్యటనకు వస్తున్నారంటే తప్ప.. అక్కడి నుంచి తొలగించే వారు కాదు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారి పోతుంది. ఉదయాన్నే కాలనీల్లో మైకు వినపడగానే చెత్తబండి వచ్చిందని ప్రజలు నిద్రలోంచి లేచి బయటకు వచ్చి చూస్తున్నారు. గ్రామ ప్రజలు నిద్రలో నుంచి మేల్కొనక ముందే వీధుల్లోకి చెత్త బండి వస్తుంది. తమ ఇళ్లకు చెత్త బండి రాగానే పరిగెత్తుకెళ్లి చెత్తను బండిలో వేస్తున్నారు. వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండలంలోని చాలా గ్రామాల్లో మారిన చిత్రమిది.

swacha bharat, vikarabad, kulkacharla
కుల్కచర్ల మండలం, వికారాబాద్​, స్వచ్ఛ భారత్​
author img

By

Published : Jan 4, 2021, 1:39 PM IST

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ నిధుల నుంచి ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. ప్రతి రోజు గ్రామాల్లోని వీధుల్లోకి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక డంపింగ్‌యార్డును నిర్మించాలని అధికారులు సూచించారు. దీంతో గ్రామాల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు చేపట్టి అక్కడికి చెత్తను తరలిస్తున్నారు. ఈ కార్యాచరణ వలన ప్రస్తుతం గ్రామాల్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రతి నిత్యం చెత్తను తరలిస్తుండటం వలన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఇళ్ల మధ్య, వీధుల్లో, రోడ్ల పక్కన పారబోస్తే వెంటనే గుర్తించి పారబోసిన వారికి రూ.500 జరిమాన విధిస్తున్నారు. దీంతో ప్రజలకు అవగాహన కలిగింది. గ్రామాల్లో ఇప్పటికే పలువురు జరిమానాలు విధించడంతో ఇళ్ల మధ్యన పారబోయడం లేదు.

swacha bharat, vikarabad, kulkacharla
రాంనగర్‌లో వాహనంలోకి చెత్తను వేస్తున్న గ్రామ ప్రజలు
  • కుల్కచర్ల మండల వ్యాప్తంగా డంపింగ్‌ యార్డు నిర్మాణాలు పూర్తైన గ్రామాల నుంచి 45 కిలోల పేపర్‌ వ్యర్థాలు, 50 కిలోల పొడి చెత్త, 84 కిలోల ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించినట్లు మండల అధికారులు తెలిపారు.
  • వివిధ రకాల ఆహార వ్యర్థాలు, ఇతర పదార్థాలను ఒకే చోట పారబోయడం ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు తడి, పొడి చెత్తను వేరుగా పారబోయాలని సూచించారు.
  • గ్రామాల్లో ప్రజలకు వేర్వేరు రంగుల రెండు డబ్బాలను అందించారు. ఒకటి తడి చెత్త వేయడానికి మరొకటి పొడి చెత్తను వేయడానికి ఉపయోగించాలని చెబుతున్నారు.
  • చెత్తను తీసుకువెళ్లే వాహనంలో కూడా రెండు భాగాలను ఏర్పాటు చేశారు. ఒక వైపు తడి, మరొక వైపు పొడి చెత్తను వేయాలి.

కేజీ ఎరువుకు రూ.100

సేకరించిన కూరగాయాల వ్యర్థాలు, ఇతర తడి ఆహార పదార్థాలతో వర్మి కంపోస్టును తయారు చేయవచ్చని స్వచ్ఛభారత్‌ మిషన్‌ డీపీఎం జిల్లా అధికారిణి లక్ష్మి తెలిపారు. ఈ ఎరువును విక్రయిస్తే కేజీకి రూ.100 వస్తాయని పేర్కొన్నారు. అందుకే ప్రతి గ్రామంలో తడి చెత్తను సేకరించడానికి ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు. కంపోస్టు ఎరువుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నందున ఆ వైపుగా గ్రామ పంచాయతీ వారు దృష్టి పెట్టాలంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీలు కంపోస్టు తయారీపై దృష్టి సారిస్తున్నారు. ప్లాస్టిక్‌ సీసాలు, ఇతర రబ్బరు వస్తువులు, గాజు బాటిళ్లను వేరు చేసి అమ్మడం ద్వారా ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలియజేస్తున్నారు.

swacha bharat, vikarabad, kulkacharla
కుల్కచర్లలో తయారు చేస్తున్న కంపోస్టు ఎరువు

ప్రజల సహకారంతో మార్పు కనిపిస్తోంది..

పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో మంచి మార్పు కనిపిస్తుంది. అధికారులు సూచించిన విధంగా ఎప్పటికప్పుడూ చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం ద్వారా ప్రతి ఒక్కరు చెత్తను చెత్త బండ్లలోనే వేస్తున్నారు. ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తుంది.

శంకర్‌నాయక్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు

అందరికీ అవగాహన కల్పిస్తున్నాం..

చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి చెత్త బండికీ ఒక మైకును ఏర్పాటు చేయించేలా చూస్తున్నాం. తడి, పొడి చెత్తను వేరుగా వేయాలని గతంలోనే చెప్పడం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోసిన వారికి జరిమానా ఉంటుంది.

-కాలుసింగ్‌, ఎంపీడీవో, కుల్కచర్ల

ఇదీ చదవండి: తల్లిదండ్రులూ పారాహుషార్‌... మత్తును వదిలించాల్సింది మీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.