మీ కళ్లు మిమ్మల్ని ఎన్నో సార్లు మోసం చేస్తాయి. చూసేవాన్నీ వాస్తవాలు కాకపోవచ్చు. దగ్గరికెళ్లి చూస్తే కానీ అసలు నిజాలు తెలియవు. అలాంటి దృశ్యమే మనం చూస్తున్న ఈ వృక్షం.
అదేంటంటే...
వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టపై ఉన్న అటవీశాఖ అతిథి గృహం.. పర్యటకులను కనువిందు చేస్తోంది. ఆకురాల్చి అడవంతా మోడుగా ఉన్న సమయంలో ఓ చెట్టు కొమ్మపై రకరకాల పక్షులు వాలి ఆకట్టుకుంటున్నాయి. నిశితంగా పరిశీలిస్తే కానీ... అవన్నీ పక్షుల బొమ్మలని అర్థమవుతాయి. అతిథి గృహంలో ఇలా అందంగా ఆకర్షణీయంగా ఈ చెట్టు కొమ్మను ఏర్పాటు చేయడం వెనుక ఓ చిన్న సంఘటన ఉంది.
అసలు కథ ఇది
ఓ రోజు అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎఫ్ఓ వేణుమాదవరావుకు విరిగిపడిన జువ్విచెట్టు కొమ్మ కనిపించింది. శాఖలుగా విస్తరించి అందంగా ఉన్న ఆ కొమ్మను సిబ్బంది సహాయంతో అతిథి గృహానికి తీసుకొచ్చారు. రంగులు వేయించారు. ఎండిపోయిన బోరుబావిపై పెట్టి అనంతగిరి అడువుల్లో విహరించే రకరకాల పక్షుల బొమ్మలతో తీర్చిదిద్దారు. ఎక్కడో అడవిలో విరిగిపడిన కొమ్మ... ఎండిపోయిన బోరుబావి.... దానిపై రకరకాల పక్షులు కనిపించడం... అటువైపుగా వచ్చే పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం