వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని శ్రీరామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని ఏకశిలా పర్వతంపై ఉన్న శివలింగానికి భక్తులు అభిషేకం నిర్వహించారు.
రావణ సంహారం అనంతరం కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
- ఇదీ చూడండి : పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్ ఎమ్మార్వో