ETV Bharat / state

గోడ దూకేందుకు సై అంటున్న సర్పంచ్‌లు - ఆశల వలతో రాత్రికి రాత్రే కండువాల మార్పు - Sarpanchs jumping in Telangana assembly elections

Sarpanches Party Jumping in Telangana : తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఓ వైపు ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంగా పార్టీలూ వ్యూహాలు రూపొందిస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లోని బడాబడా నాయకులనే గాక గ్రామాల్లోని సర్పంచ్‌లకు గాలం వేస్తున్నాయి. తద్వారా సర్పంచ్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఏ కండువా కప్పుకుంటారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 1:31 PM IST

Sarpanches Party Jumping in Telangana : రాష్ట్రంలో ఎన్నికల (Telangana Assembly Elections) వేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలు.. ప్రత్యర్థి పార్టీలోని నేతలపై ఫోకస్‌ పెట్టాయి. గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీకి పట్టుగొమ్మలైన గ్రామాలపై దృష్టి సారించాయి. వీటికి సారథ్యం వహించే సర్పంచులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే వీరి మద్దతు తమకే ఉండేలా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారాలు

Telangana Leaders Party Jumping : ఒకప్పుడు ఎవరైనా సర్పంచి పార్టీ మారి మద్దతు తెలపాలంటే ప్రజా సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడలా కాదు. పార్టీలు చూపిస్తున్న డబ్బు, పదవులు వంటి ఆశలతో నాకు ఏంటీ అనే ఆలోచన పెరిగింది. ఎవరు ఎక్కువ ఇస్తారా అని ఇటూ, అటూ ఎదురు చూపూలు చూస్తున్నారు. బహిరంగంగా లేదా చాటుమాటూ ఒప్పందాలు కుదుర్చుకుంటూ.. రాత్రికి రాతే పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ తంతు బాగా ఎక్కువవుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక కథనం

2018 ఫలితాల అనంతరం..

చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వెళ్లే నవాబుపేట మండలానికి చెందిన 32 సర్పంచులను మినహాయిస్తే.. 2018 సర్పంచి ఎన్నికల్లో జిల్లాలో 534 మంది సర్పంచ్‌లు ఉన్నారు.

  • వికారాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 119 మంది (సగం బీఆర్ఎస్‌) సర్పంచులకు 8 మంది, తాండూరు నియోజకవర్గంలో 161 మంది సర్పంచులకు (సగానికి దగ్గరగా బీఆర్ఎస్‌) ఉండగా, వీరిలో అటూ, ఇటూ దాదాపు 15 మంది సర్పంచులు కండువాలు మార్చుకున్నారు. ఇంకా వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.
  • పరిగి నియోజకవర్గంలో మొత్తం 148 మంది సర్పంచులకు (సగం బీఆర్ఎస్‌) వీరిలో 5 మంది పార్టీలు మారారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
  • కొడంగల్‌ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన 106 మంది సర్పంచులున్నారు. వీరిలో బీఆర్ఎస్‌కు కాస్తంత ఆధిక్యం ఉంది. ఇక్కడ కూడా ఇతర పార్టీలోకి గోడ దూకేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు.

పట్టున్న వారిపై ప్రత్యేక దృష్టి : ఈసారి అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎలాగైనా గెలుపు తమదే కావాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీంతో పల్లెల్లో పట్టున్న సర్పంచులపై ఫోకస్ పెట్టాయి. వీరి అవసరం సర్పంచులకు డిమాండ్‌ పెంచుతోంది. ఆయా పార్టీల్లో అసంతృప్తులను గుర్తించి వారికి భారీగా తాయిలాల ఆశ చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడితే పదవులు ఇస్తామని, సముచిత గౌరవం దక్కేలా చూస్తామని హామీలిస్తూ పార్టీలోకి చేర్చుకునేలా పావులు కదుపుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఎన్నికైనా విలక్షణ తీర్పే - ఈసారి ఓటరు చూపు ఎటువైపో?

ప్రాధాన్యం దక్కలేదంటూ : పార్టీ మారే సర్పంచులు, ఇతర నేతలు (Telangana Leaders Change Parties) అంటున్నది.. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మొదటి నుంచి ఫలానా అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కృషి చేశామని పేర్కొంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కొత్తగా పార్టీలోకి చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారికే పదవులు కట్టబెట్టారని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ మారుతున్నామని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వారిని ప్రశ్నిస్తే.. తాము ఎంతచేసినా తమకు సరైన న్యాయం జరగలేదని వాపోతున్నారు.

కొన్ని ఉదాహరణలు..

  1. ఇటీవలే పరిగి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన 5 మంది సర్పంచులు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో బేరం కుదుర్చుకొని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకొని పార్టీ మారారు.
  2. కొడంగల్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎనిమిది మంది సర్పంచులు.. ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారారు. ఇందులో భాగంగా ఒక్కో సర్పంచి స్థాయిని ఆధారంగా చేసుకొని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
  3. తాండూరు నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన పదమూడు మంది సర్పంచులు కండువాను మార్చారు. దీనికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
  4. వికారాబాద్‌ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన ఇతరులు, పలువురు సర్పంచులు తమను పట్టించుకోవడం లేదని,.. అదేవిధంగా సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన నేతలు అప్రమత్తమై వారితో చర్చలు జరిపి ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి పార్టీ మారే ఆలోచనను విరమింపజేశారు.

గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసవత్తర పోరు - నీలగిరిలో నిలిచేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.