ETV Bharat / state

గ్రామ కార్యదర్శిపై దాడి చేసిన సర్పంచ్​ సస్పెండ్​

గ్రామ కార్యదర్శిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన సర్పంచ్​పై వికారాబాద్​ కలెక్టర్​ చర్యలు తీసుకున్నారు. పంపిన షోకాజ్​ నోటీసుకు సంజాయిషీ ఇవ్వనందున ఆరునెలల పాటు సర్పంచ్​ను సస్పెండ్​ ఉత్తర్వులు జారీ చేశారు.

sarpanch suspended in vikarabad district
గ్రామ కార్యదర్శిపై దాడి చేసిన సర్పంచ్​ సస్పెండ్​
author img

By

Published : May 14, 2020, 11:57 PM IST

గ్రామ కార్యదర్శిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన సర్పంచ్​పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ సర్పంచ్ అసదుద్దీన్ హైదర్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పౌసమి బసు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 23న సర్పంచ్ దాడి చేసి కులం పేరుతో దూషించాడని గ్రామ కార్యదర్శి బందయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదుతో అప్పట్లోనే సర్పంచ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్​పై పోలీసులు విచారణ జరిపారు. చేసిన దాడికి సంజాయిషీ ఇవ్వాలని అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు సర్పంచ్ సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల అతన్ని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: మానవత్వం చాటుకున్న ఇద్దరు దివ్యాంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.