వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్ధృతం చేశారు. సమ్మెకు రెవెన్యూ సిబ్బంది మద్దతు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ముందు బైటాయించారు. సమ్మెకు మద్దతుగా సీపీఎం నిరాహారదీక్షలు చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.... స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"