రైలింజన్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది రైల్వే ట్రాక్‌పై పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో హైద్రాబాద్ నుంచి రైలింజన్ వికారాబాద్ వైపు వచ్చింది.
దగ్గరికి వచ్చిన తర్వాత గమనించిన రైల్వే ఉద్యోగులు ట్రాక్‌పై నుంచి పక్కకు వచ్చే సమయంలో ముగ్గురిని ఢీకొట్టింది. తొమ్మిది మంది రైల్వే ఉద్యోగులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనా స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ సందర్శించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్