వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి 22 ఏళ్ల నగేష్ దుశ్చర్యకు ఒడిగట్టాడు. మరుసటి రోజు చిన్నారికి జ్వరం రావడం వల్ల తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి ద్వారా అత్యాచారం గురించి తెలిసిన తల్లిదండ్రులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం తాండూరు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి:'బాలికపై అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి'