రంజాన్ పండుగ సందర్భంగా.. ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ముస్లిం ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల మండలాలలో రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.
కరోనా నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో.. ప్రార్థనలను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు తప్పనిసరి ధరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈద్గాలు, మసీదులకు వెళ్లొద్దని ముస్లిం సోదరులకు సూచించారు.
ఇదీ చూడండి: అక్రమ లే అవుట్లు 3,892