తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యమ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొ. జయశంకర్ అని స్వేరో జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ కొనియాడారు. వికారబాద్ జిల్లా పరిగిలో ఆయన జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఎంపీపీ సత్యహరిచంద్ర సిద్ధాంతకర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ఆయన విగ్రహా నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఇవీ చూడండి: 'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'